తల్లికి వందనం సూపర్ సక్సెస్! అని తల్లుల కళ్లలో ఆనందం చూసిజగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగిందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారని అన్నారు. ఈమేరకు సదరు పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని తెలిపారు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయని స్పష్టం చేశారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం..చెయ్యనివ్వమని లోకేష్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్ది అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ కు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
#PsychoFekuJagan#TallikiVandanam
తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి
జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా… pic.twitter.com/GhgmEkpKJJ— Lokesh Nara (@naralokesh) June 15, 2025