ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని వస్తున్న సందర్భంగా… సీఎం చంద్రబాబు విశాఖ వెళ్లి యోగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించారు. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యేలా స్ఫూర్తినిచ్చే విధంగా యోగా డే జరగాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ యోగా డేలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాలలో చేసిన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్ అరేంజ్ మెంట్స్ గురించి సీఎంకు వివరించారు. 2 కోట్ల మంది భాగస్వామ్యంతో గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా యోగా డే నిర్వహించనున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యేలా స్ఫూర్తినిచ్చే విధంగా యోగా డే: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read