ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని క్షేత్ర స్థాయిలో తీసుకుని వస్తే లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని సీఎం వివరించారు. త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు. క్వాంటమ్ వ్యాలీకి లాగా మనం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో కూడా అందరి కంటే ముందు ఉండాలని సూచించారు. సింగపూర్‌తో సంబంధాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మన చూపించిన చొరవతో సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేసిందని గుర్తు చేశారు. వీటితో పాటు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు పాల్గొన్నారు.
Previous Articleమేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం… మీరు మంచి ఫలితాలు సాధించి పేరు నిలబెట్టాలి: మంత్రి నారా లోకేష్
Next Article భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో నూతన అధ్యాయం..!