సింగపూర్ రెండో రోజు పర్యటనలో ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబుతో కలిసి ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సమావేశంలో చర్చించినట్లు లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కోరినట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ఆసక్తి కనబరిచారని తెలిపారు.
ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి నారా లోకేష్
సింగపూర్ లో తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు. గత ఐదేళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అందుకే ఏ దేశం వెళ్లినా తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నాం. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్పూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు