నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. మువ్వన్నెల జెండా ఓ ఉద్వేగం…ఓ స్ఫూర్తి అని కొనియాడారు.జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగువారు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. మోడీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ఉందని అన్నారు. భారత్ ది డెడ్ ఎకానమీ కాదు…గుడ్ ఎకానమీ అని కొనియాడారు.మోడీ నాయకత్వంలో త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని స్పష్టం చేశారు. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleమంత్రి కందుల దుర్గేష్ తో తెలుగు సినీ నిర్మాతల భేటీ
Next Article ఏపీ మెగా డీఎస్సీ 2025 తుది ఫలితాలు విడుదల.!