ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి మారెడ్డి లతా రెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయన అక్కడే నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడ నుంచి బయటకు పంపించి అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ ఎన్నికలను కూటమి మరియు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగనుంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
నేడే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక…కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్టు
By admin1 Min Read