పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది. కూటమి తరపున బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. టీడీపీకి 6,735 ఓట్లు, వైసీపీ-683 ఓట్లు వచ్చాయి . 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకుంది.పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని హామీ ఇచ్చిన ప్రకారం, నీరు అందించి, అన్ని నియోజకవర్గాలు లాగే, అభివృద్ధి ఫలాలను పులివెందుల ప్రజలకు, కూటమి ప్రభుత్వం అందిస్తుందని టీడీపీ పేర్కొంది.
Previous Articleఆగష్టు 14.. దేశ విభజన గాయాల స్మారక దినం
Next Article లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ మరో ఘనత