దేశంలో తొలిసారి పర్యాటకంగా ‘సీ ప్లేన్’ వినియోగం ప్రారంభమైంది. ఏపీ నుండి నేడు ఏపీ సీఎం చంద్రబాబు సీ ప్లేన్ పర్యాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుండి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఇందులో ప్రయాణించి, పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. అనతికాలంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడని కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడాయన అని కొనియాడారు. సీ ప్లేన్ ప్రయాణం. వినూత్న అవకాశం. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. సంపద సృష్టిస్తేనే అదాయం పెరుగుతుంది. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది. దానిని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు ఐటీ అంటే ఆనాడు ఎగతాళి చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా మనవాళ్లే ఉన్నారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేయాలి. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుందని అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ నుండి బయలుదేరి శ్రీశైలం చేరుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు