రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమేనని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 5నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతోనే కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైందని పేర్కొన్నారు. అయిదేళ్లలో 20లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే తాను చేస్తున్న ప్రయత్నాలు సాకారమవుతున్నాయని లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయన్న ఆనాడు చెప్పిన మాటలు నిజమవుతున్నాయని మిట్టల్, రిలయన్స్ రెన్యువబుల్ ఎనర్జీ, టిసిఎస్, సెరెంటికా గ్లోబల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వరుసకట్టాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపిబి) సమావేశంలో రూ. 85వేల కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం రీస్టార్ట్ ఏపిలో తొలి అడుగని రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎస్ఐపిబి తొలి సమావేశంలోనే యువతకు 34వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేయడం ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు