2024 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభ లో సీఎం మాట్లాడారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఆయన వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై మండిపడ్డారు. ఒక్కో ఇటుకా పేరుస్తూ ముందుకెళ్తున్నట్లు వివరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారని వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థిలా నేర్చుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న సంగతిని గుర్తు చేసుకున్నారు. వేధింపులకు గురిచేసి చివరికి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇబ్బందులు ఎదురైతే ఇంకా మనోధైర్యంతో ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు.
తాను జైల్లో ఉన్నప్పుడు ప్రపంచదేశాల్లోని తెలుగువారు రోడ్డు పైకి వచ్చి పోరాడారని ప్రజలు ఇచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా చెరగదని చెప్పారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం అరుదైన అనుభవమని అన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని అధికారం, సీఎం కుర్చీ, కేంద్ర రాజకీయాలు కూడా కొత్త కాదని అన్నారు. ప్రాంతీయ పార్టీగా టీడీపీ కేంద్రంలో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించిందన్నారు.
విధ్వంసమైన వ్యవస్థలు, గాడితప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వ అప్పులు, తప్పులు ఈ ప్రభుత్వానికి సవాలుగా మారాయని సవాల్ ని స్వీకరించి మళ్ళీ ప్రజలను నిలబెడతానని పేర్కొన్నారు.21 మంది ఎంపీలతో ఢిల్లీలో ఏపీ పరపతి పెరిగింది. ఒక్కో ఇటుకా పేరుస్తూ ముందుకెళ్తున్నాం. రాత్రికి రాత్రే ఏదీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రజలకు తెలియజేయాలి. అంకితభావంతో పనిచేస్తూ రాజీ లేకుండా ముందుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్డార్. ఊరుకునేది లేదు.సహించేది లేదని చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ర్యాలీ చేపడతామని పిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఎవరైనా భూకబ్జాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు