ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యానిఫెస్టోలో చెప్పిన మరో హామీ నెరవేరుస్తున్నట్లు ఈసందర్భంగా పేర్కొంది. రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించింది. రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం చాలా మందికి లబ్ధి చేకూర్చనుంది.
మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారు. ఒకవేళ రెండు నెలలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే ఆ రెండు నెలల మొత్తాన్ని కలిపి మూడో నెలలో మూడు నెలల పెన్షన్ మొత్తం ఇచ్చే విధంగా రూపకల్పన చేసింది.
వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించిన పక్షంలో అతని భార్యకు మరుసటి నెలలోనే వితంతు పెన్షన్ మంజూరు చేయటం జరుగుతుంది. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
By admin1 Min Read
Previous Articleప్రసార భారతి ఓటీటీ ‘వేవ్స్’ లో ఉచితంగా రామాయణం, మహాభారతం
Next Article బిగ్ డే వచ్చేసింది: బుచ్చిబాబు