ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని అన్నారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లంచాల కోసం జగన్ ఆంధ్రప్రదేశ్ ను సొంత జాగీరులా వాడుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుండి రూ.1,750కోట్ల లంచం తీసుకోవడంపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేయాలని ఒక్కో ఒప్పందానికి జగన్ ఎంత లంచం తీసుకున్నారో తేల్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అక్రమాలతో ప్రజలపై రూ. వేలకోట్ల భారం పడుతోందని షర్మిల విమర్శించారు.
ప్రభాస్ ఎవరో ఇప్పటికీ తెలియదు
ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలకృష్ణగారి నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుండి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ కేసు పెట్టినట్లు ఇటీవల చెప్పారు. మీకు నిజంగానే చెల్లెలిపై ప్రేమ ఉంటే, బాలకృష్ణగారి నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుండి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే, ఐదేళ్లు సీఎంగా ఉండి మీరేం చేశారు? బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? అని ప్రశ్నించారు. మీరిప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రభాస్ కు నాకూ సంబంధం ఉందని నాపై జరిగిన అసత్య ప్రచారంపై నేను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంత వరకూ చూడలేదు. నా బిడ్డల పై ప్రమాణం చేసి చెబుతున్నా, ప్రభాస్ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదని స్పష్టం చేశారు.
జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా లో విమర్శలు చేయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మీకు చెల్లెలిపై ప్రేమ ఉందా? మళ్లీ నా వీడియోనే ప్లే చేసి, మీకు మైలేజీ వచ్చేటట్లు వాడుకుంటున్నారు. మీకు పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు