రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగు రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3,ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా నుండి ఖాళీగా ఉన్న ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేసింది. ఏపీలో మోపిదేవి, వెంకటరమణ బీద మస్తాన్, కృష్ణయ్య రాజీనామాలతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. డిసెంబర్ 3 నుండి10 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. డిసెంబర్ 20న పోలింగ్. అదే రోజు కౌంటింగ్ జరుగనుంది.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు కాగా, 164 సీట్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ..ప్రస్తుతం వైసీపీ సంఖ్యాబలం 11 మాత్రమే. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు