కృష్ణాజిల్లా పోరంకిలో జరిగిన ఎనర్జీ ఎఫిషియన్సీపై ఉర్జావీర్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం రాష్ట్ర ప్రగతికి చిహ్నం అని పేర్కొన్నారు. 1998లో విద్యుత్ సంస్కరణలు తీసుకు వచ్చినట్లు తెలిపారు. అప్పట్లో రైతులు, పారిశ్రామిక వేత్తలు, గృహ యజమానులు అనేక ఇబ్బందులు పడేవారు నుండి అయితే 2004కు మనం మిగులు విద్యుత్ కు చేరుకున్నామని వివరించారు. ఎల్.ఈ.డీలు, ట్యూబ్ లైట్లతో గ్రామాల్లో వెలుగులు నింపామని తెలిపారు. అప్పుడు చేసిన పనులు వలన రాష్ట్ర విద్యుత్ శాఖ అనేక అవార్డులు పొందిందన్నారు. 15 రోజులు క్రితం పిలుపునిస్తే 12 వేల మంది ఉర్జావీర్ లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. కొందరు ఆపరేషన్ కూడా ప్రారంభించారని ఒక్కో ఉర్జావీర్ కు రూ.2500 నుండి రూ.15 వేల వరకు అదనంగా ఆదాయం వస్తుంది. ఇంటి దగ్గర ఉండే పని చేయడానికి ఇదో మంచి ఆదాయ మార్గమని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఇంటి నుండి పని చేసే విధానం పెరుగుతోందన్నారు. సరికొత్త స్కిల్స్ నేర్చుకుంటే ప్రపంచంతో పోటీ పడగలమని స్కిల్స్ నేర్చుకునేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎనర్జీ ఎఫిషియన్సీపై ఉర్జావీర్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
By admin1 Min Read