విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగిన తరవాత పొట్టి శ్రీరాములు గారి త్యాగం విలువ అర్థమైంది. ఆయన 56 రోజుల పాటు కఠోర ఆమరణ నిరహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం సిద్దించేలా చేసారని కొనియాడారు. ఆయన ఆత్మబలిదానం తరవాత ఆయన భౌతిక కాయం మొయ్యడానికి కూడా నలుగురు లేని పరిస్థితి భాదాకరం. ఘంటసాల లాంటి కొంతమంది మహానుభావులు ఆరోజు నిలబడ్డారు. ఆయన త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్రమని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం ప్రతీ తరానికి గుర్తు ఉండాలి అని క్యాబినెట్ లో మాకు చెప్పి, ఆ మహనీయుని వర్ధంతిని ఆత్మార్పణ దినంగా ఘనంగా జరపాలని సీఎం చంద్రబాబు అనడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మద్రాసులో తెలుగు వారిని మద్రాసీలు అంటుంటే, నేను తెలుగువాడిని అని ఆత్మగౌరవంతో నినదించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని పవన్ కొనియాడారు.
ఏపీ సమగ్రాభివృద్ధి కోసం మొన్న విడుదల చేసిన స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 అన్ని వర్గాలకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ అద్భుతమైన ఆలోచనను మా అందరి సూచనలు, సలహాలు తీసుకుంటూ సీఎం చంద్రబాబు రూపొందించడం జరిగింది. దీని మీద ఎవరైనా విమర్శలు చేస్తే అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు.
ప్రతీ ఒక్కరికీ అభివృద్ది ఫలాలు అందించేలా, అన్ని రంగాలకు సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే దిశగా స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 అమలు చేసి లక్ష్యాలు సాధించడమే పొట్టి శ్రీరాములు గారికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు