రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్) 3 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఉండవల్లిలో ఏపీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సీడాప్ చైర్మన్ గునుపాటి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి. 2కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్, స్వయం ఉపాధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఆదాయం కల్పించడం ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో యువతకు రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించేందుకు ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీడాప్ పెద్దఎత్తున స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 3 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు
By admin1 Min Read