బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే (నాలుగో) టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది.ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 155 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్ లో 234 పురుషులకే కట్టడి చేసిన భారత్ బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫలమైంది. యశస్వీ జైశ్వాల్ 84 (208; 8×4 ) ఒక్కడే చెప్పుకోదగిన ప్రదర్శన కనబరిచాడు. రిషబ్ పంత్ 30 (104;2×6) పర్వాలేదనపించాడు. ఒకానొక దశలో గెలవకపోయినా డ్రా చేసుకునే స్థితి లో నిలిచిన భారత్ పంత్ వికెట్ కోల్పోయిన అనంతరం మిగిలిన బ్యాటర్లు కూడా పెవిలియన్ కు క్యూ కట్టారు. కనీసం మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. రోహిత్ శర్మ (9), కే.ఎల్. రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5), జడేజా (2), నితీష్ కుమార్ రెడ్డి (1) విఫలమయ్యారు. టెయిలండర్లు కూడా అదే దారిలో నడిచారు. ఆకాష్ దీప్ (7), బుమ్రా (0), సిరాజ్ (0) వాషింగ్టన్ సుందర్ 5 నాటౌట్ గా ఉన్నాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు, బోలాండ్ 3 వికెట్లు, లైయాన్ 2 వికెట్లు, స్టార్క్, ట్రావిస్ హెడ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. పాట్ కమ్మిన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.ఇక ఈ మ్యాచ్ పరాజయంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
ఇరు జట్ల సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా:474&234
భారత్: 369&155.
Previous Articleడిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో దిల్‌రాజు భేటీ…!
Next Article నో మిల్క్… నో వెజిటబుల్స్ పంజాబ్ రైతులు బంద్…!