ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ వేదికగా గ్లోబల్ జావెలిన్ ఛాంపియన్ షిప్ జరగనుంది. ఈ ఈవెంట్ లో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రాతో పాటు అగ్రశ్రేణి ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. ఇక 2027 రిలేస్, 2028 ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్, 2029 ప్రపంచ ఛాంపియన్ షిప్ లకు బిడ్ లు మొదలయ్యాయని ఈ టోర్నీల నిర్వాహణకు భారత్ తన ఆసక్తిని తెలియజేసిందని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సుపరివాలా తెలిపారు. ఇక ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా మాజీ షాట్ పుట్ ఆటగాడు బహాదూర్ సింగ్ ఎంపికయ్యాడు. 2002 ఆసియా క్రీడల్లో ఆయన స్వర్ణం సాధించాడు. 51 ఏళ్ల బహాదూర్ సింగ్ 2029 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నాడు. ఇక ఈ ఏడాది ఆగస్టు 10న ప్రారంభంకానున్న ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ పోటీలు భారత్ లో జరుగనున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు