భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్,యూట్యూబర్
ధనశ్రీ వర్మ జంట విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోయేందుకు నిర్ణయించుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో విడాకుల రూమర్స్‌పై చాహల్ భార్య ధనశ్రీ మౌనం వీడారు.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తలను చూస్తుంటే నాకు,నా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది.నిజాలు తెలుసుకోకుండా నిరాధారమైన రాతలు రాస్తున్నారు.నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.ఈ విషయం నన్ను తీవ్రంగా బాధిస్తోంది.జీవితంలో ఎదగడానికి,మంచి పేరు తెచ్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను.నా మౌనం బలహీనతకు సంకేతం కాదు.విలువలకు కట్టుబడి వాస్తవం పై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాను.నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని ధనశ్రీ వర్మ పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు