భారత జట్టు యువ ఆల్ రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కాలినడకన కొండపైకి వెళ్లి, మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. ఐపీఎల్లో గతేడాది నితీశ్ రెడ్డి తన ఆల్ రౌండ్ ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత జట్టు లో స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు జట్టులో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా నిలిచాడు. సెంచరీ కూడా సాధించాడు. అటు బౌలింగ్లోనూ మంచి ప్రదర్శన కనబరిచాడు.
Govinda Govinda 🙏🏻🙏🏻#nitishkumarreddy #Tirupati pic.twitter.com/Deu88pK9rX
— Nitish Reddy (@NitishKReddy) January 14, 2025