ఆస్ట్రేలియన్ ఓపెన్ నుండి సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ వైదొలిగాడు. జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ తో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఏడోసీడ్ జకోవిచ్ తొలి సెట్లో 6-7 (5-7)తో వెనుబడిన సమయంలో గాయంతో తప్పుకున్నాడు. అయితే వైదొలగడానికి ముందు నొవాక్ గట్టి పోరాటం కనబరిచాడు. నేటి మ్యాచ్ కోసం కోలుకోవడానికి ప్రయత్నించినట్లు జకోవిచ్ పేర్కొన్నాడు. మరొక గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేసరినందుకు జ్వెరెవ్ కు అభినందనలు తెలిపాడు. అతను టైటిల్ గెలవాలని జ్వెరెవ్ దానికి అర్హులని జకోవిచ్ పేర్కొన్నాడు.మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ టెన్నిస్ స్టార్ యానెక్ సినర్ టైటిల్కు చేరువయ్యాడు. సెమీస్ పోరులో ఈ టాప్ సీడ్ 7-6 (7-2), 6-2, 6-2తో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ పై విజయం సాధించాడు.
Previous Articleపర్యాటకులకు గుడ్ న్యూస్.. తాజ్ మహల్ ఫ్రీ ఎంట్రీ
Next Article ఐసీసీ ప్రకటించిన ఇయర్ ఆఫ్ ది టీమ్స్ ఇవే..!