టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో యువ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఎనిమిదో రౌండ్లో డ్రా చేసుకున్నాడు. తాజాగా మరో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో 33 ఎత్తుల్లో డ్రాకు ఒప్పుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా అపజయం లేని గుకేశ్ మూడు గేమ్ లలో విజయం సాధించగా… అయిదింటిలో డ్రా చేసుకున్నాడు. మరోవైపు అర్జున్ ఇరిగేశి, పెంటేల హరికృష్ణలకు కూడా డ్రానే ఎదురైంది. సెర్బియాకు చెందిన సరానా అలెక్సీ తో అర్జున్ గేమ్ 23 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది.నెదర్లాండ్స్ అనీష్ గిరి తో పోరును హరికృష్ణ 30 ఎత్తుల్లో డ్రాగా పూర్తి చేశాడు.
Previous Articleస్వర్ణం సాధించిన భారత అగ్రశ్రేణి అథ్లెట్ జ్యోతి యర్రాజీ
Next Article ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ లో శిఖర్ ధావన్

