ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20ల్లో భారత ఓపెనర్ సంజు శాంసన్ పెద్దగా ప్రభావం చూపించలేదు.తొలి మ్యాచ్‌లో 26 పరుగులు చేసినా.. దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.ఇక రెండో టీ20లో ఐదు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.రెండుసార్లూ జోఫ్రా ఆర్చర్‌కే వికెట్ ఇచ్చాడు.షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో ఇబ్బందిపడ్డాడు.రాజ్‌కోట్ వేదికగా జరగబోయే మూడో టీ20లో అలాంటి అవకాశం ఆర్చర్‌కు ఇవ్వకూడదనే ఉద్దేశంతో సంజు తీవ్ర సాధన చేశాడు. సిమెంట్ పిచ్‌పై కొత్త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్ స్పెషలిస్టులు కూడా అతడికి సాయం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు కేవలం ప్లాస్టిక్ బంతితోనే పుల్, హుక్ షాట్లను ఆడాడు. అదే విధంగా ర్యాంప్, కట్ షాట్లను కొట్టాడు**. ఆ తర్వాత మరో అర్ధగంటపాటు క్లైంబింగ్ బాల్ (వేలాడదీసిన బంతులు)తో ప్రాక్టీస్ చేశాడు
Previous Articleఢిల్లీ రంజీ జట్టులో విరాట్ కోహ్లి…!
Next Article నెట్‌ఫ్లిక్స్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు..!