భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 2-0 ఆధిక్యంతో నిలవడమే కాక సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటయింది. జో రూట్ 69 (72; 6×4), డకెట్ 65 (56; 10×4) హాఫ్ సెంచరీలు సాధించారు. లివింగ్ స్టోన్ 41 (32; 2×4, 2×6), జాస్ బట్లర్ 34 (35; 2×4), హ్యారీ బ్రూక్ 31 (52; 3×4, 1×6) సాల్ట్ 26 (29; 2×4, 1×6) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 300 మార్క్ దాటింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు, షమీ, హార్షిత్ రాణా, హార్థిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఎక్కడా తడబడలేదు. రోహిత్ శర్మ- శుభ్ మాన్ గిల్ 136 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి శుభారంభం చేశారు. గత కొంత కాలంగా నిరాశ పరుస్తున్న రోహిత్ శర్మ 119 (90; 12×4, 7×6) సెంచరీతో సత్తా చాటాడు. భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. శుభ్ మాన్ గిల్ 60 (52; 9×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41 నాటౌట్) కూడా ఆకట్టుకున్నారు. దీంతో ఈ సిరీస్ లో భారత్ మరో విజయాన్ని సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు