ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 0-3తో జపాన్ చేతిలో ఓటమితో నిష్క్రమించింది. మిక్స్డ్ డబుల్స్ ధ్రువ్ కపిల- తనీషా 13-21, 21-17, 13-21తో హిరొకి- నత్సు చేతిలో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ లో మాళవిక బాన్సోద్ 12-21, 19-21తో తొమొక మియజాకి ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్ లో హెచ్.ఎస్.ప్రణయ్ 14-21, 21-15, 12-21తో కెంటా నిషిమొటో చేతిలో ఓటమి చెందాడు. వరుసగా మూడింట్ లో భారత్ ఓడిపోవడంతో తర్వాతి రెండు మ్యాచ్ లతో పనిలేకుండానే జపాన్ సెమీస్ చేరుకుంది.
Previous Articleమార్చ్ 19న భూమి మీదకు తిరిగి రానున్న సునీత విల్లియమ్స్ …!
Next Article డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం…!