భారత జట్టులో నెలకొన్న స్టార్ కల్చర్ పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జనాలను ప్రతిబింబించేలా తమతో పోల్చుకునే విధంగా ఆటగాళ్లు ఉండాలి గానీ వారిని దేవుళ్ళుగా, సూపర్ స్టార్లుగా కొలిచే విధానానికి గుడ్ బై చెప్పాలని సూచించారు. భారత క్రికెట్ లో పరిస్థితులను సాధారణంగా ఉంచడం ముఖ్యం. మేము క్రికెటర్లం మాత్రమే సూపర్ స్టార్స్ కాదు జట్టు లో సెలబ్రిటీ కల్చర్, ఆటగాళ్లను ఆరాధించే విధానాన్ని ప్రోత్సహించడాన్ని సరికాదని అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎంతో సాధించారని వారు ఇంకో సెంచరీ చేస్తే అది అప్పటివరకు వారు సాధించిన దానికంటే ఎక్కువై పోదని దానిని సాధరణ ఘనతగానే చూడాలని అన్నాడు. మన లక్ష్యం ఈ ఘనతల కంటే ఉత్తమంగా ఉండాలన్నారు. దేశం కోసం గెలవడం కంటే ఇవేవి గొప్పవి కాదని పేర్కొన్నాడు.
Previous Articleతాజాగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు… నేడు రానున్న మరికొందరు
Next Article న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట