ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ నేడు ప్రారంభమైంది. 7 సంవత్సరాల తరువాత తిరిగి పునః ప్రారంభమైన ఈ టోర్నీలో భాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ మరియు ఆతిథ్య జట్టైన పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో 60పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కరాచీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు భారీ స్కోరు చేసింది. విల్ యంగ్ 107 (113; 12×4, 1×6), టామ్ లాథమ్ 118 నాటౌట్ (104; 10×4, 3×6) సెంచరీలతో కదంతొక్కారు. పాకిస్థాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. గ్లెన్ ఫిలిప్స్ 61 (39; 3×4, 4×6) కూడా మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందుంచింది. పాకిస్థాన్ బౌలర్లలో హారీస్ రావుఫ్ 2 వికెట్లు, నసీమ్ షా 2 వికెట్లు, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే కుప్పకూలింది. కుష్దిల్ షా 69 (49; 10×4, 1×6), బాబర్ అజామ్ 64 (90; 6×4, 1×6) మాత్రమే హాఫ్ సెంచరీలతో చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. సల్మాన్ ఆఘా 42 (28; 6×4, 1×6) పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. కివీస్ బౌలర్లలో విలియం ఓరుర్కే 3 వికెట్లు, శాంట్నర్ 3 వికెట్లు, మాట్ హెన్రీ 2 వికెట్లు, మైఖేల్ బ్రేస్ వెల్, నాథన్ స్మిత్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఈ మ్యాచ్ లో సెంచరీతో రాణించి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన లాథమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.ఇక తదుపరి మ్యాచ్ లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్ ఈనెల 23న భారత్ తో తలపడనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు