క్రికెట్ అభిమానులకు శుభవార్త …సచిన్,యువరాజ్ సింగ్, కుమార సంగక్కర, బ్రియాన్ లారా, క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్ లాంటి సీనియర్లు మరోసారి మైదానంలో దిగి అభిమానులను ఉత్సాహపరచనున్నారు.వీరంతా కలసి మరొకసారి క్రికెట్ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి సీజన్ నేటి నుండి ప్రారంభం కానుంది.ఈ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్ భారత్-శ్రీలంక జట్ల మధ్య నేడు జరగనుంది.
కాగా ఈ మ్యాచ్ నేడు 7.30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ లో సచిన్,యువీల బ్యాటింగ్ ను మరొకసారి ఆస్వాదించవచ్చు.అయితే ఈ మ్యాచ్ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రోజు జరగనుంది.ఈ టోర్నమెంట్ లో టీమిండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్నాడు.ఈ జట్టులో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు.దశాబ్ధ కాలం తర్వాత సచిన్-యువీ ద్వయం టీమిండియా జెర్సీ ధరించి ప్రేక్షకులను అలరించనున్నారు.