ఛాంపియన్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు భారత్ -పాకిస్థాన్ మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో భారత్ వికెట్ల తేడాతో గెలిచి మరో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయింది. సాద్ షకీల్ 62 (76;5×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. రిజ్వాన్ 46 (77; 3×4), కుష్ దిల్ 38 (39; 2×6) బాబర్ అజామ్ (23) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్థిక్ పాండ్య 2 వికెట్లు, రవీంద్ర జడేజా, హార్షిత్ రాణా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
ఇక లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 20 (15; 3×4, 1×6) అవుటైనా శుభ్ మాన్ గిల్ 46 (52; 7×4), శ్రేయాస్ అయ్యర్ 56 (67; 5×4, 1×6) లతో కలిసి విరాట్ కోహ్లీ 100 (111; 7×4) సెంచరీ సాధించడమే కాకుండా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఈక్రమంలో 14 వేల పరుగుల మైలురాయిని అధిగమించి వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. మరో అద్భుతమైన ఇన్నింగ్స్ తో జుట్టును విజయ తీరాలకు చేర్చాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు