ఛాంపియన్స్ ట్రోఫీ2025 లో భాగంగా నేడు భారత్-న్యూజిల్యాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుభ్ మాన్ గిల్ (2), విరాట్ కోహ్లీ (11) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే శ్రేయాస్ అయ్యర్ 79 (98; 4×4, 2×6), అక్షర్ పటేల్ 42 (61; 3×4, 1×6) మంచి భాగస్వామ్యంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కే.ఎల్.రాహుల్ (23) పరుగులు చేశాడు. ఆఖర్లో హార్థిక్ పాండ్య 45 (45; 4×4, 2×6) మంచి ప్రదర్శన కనబరిచాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కైల్ జేమీసన్, విలియమ్ ఓరూర్కే, మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. కేన్ విలియమ్సన్ 81 (120; 7×4) రాణించాడు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, హార్థిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు. తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అందరూ సమిష్టిగా రాణించి భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీస్ లోకి ఘనంగా టేబుల్ టాపర్ గా అడుగు పెట్టింది. అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు రాణించారు.
భారత్ ఇన్నింగ్స్: శుభ్ మాన్ గిల్ 2 (7) ఎల్బీడబ్ల్యూ (బి) మాట్ హెన్రీ; రోహిత్ శర్మ 15 (17; 1×4, 1×6) (సి) విల్ యంగ్ (బి) జామ్లెసన్; విరాట్ కోహ్లీ 11 (14; 2×4) (సి) గ్లెన్ ఫిలిప్స్ (బి) మాట్ హెన్రీ; శ్రేయాస్ అయ్యర్ 79 (98; 4×4, 2×6) (సి) విల్ యంగ్ (బి) విలియమ్ ఓరూర్కే; అక్షర్ పటేల్ 42 (61; 3×4, 1×6) (సి) విలియమ్ సన్ (బి) రచిన్ రవీంద్ర; కే.ఎల్. రాహుల్ 23 (29; 1×4) (సి) లాథమ్ (బి) శాంట్నర్; హార్థిక్ పాండ్య 45 (45; 4×4, 2×6) (సి) రచిన్ రవీంద్ర (బి) మాట్ హెన్రీ ; రవీంద్ర జడేజా 16 (20; 1×4) (సి) విలియమ్సన్ (బి) మాట్ హెన్రీ ; మహ్మద్ షమీ 5 (8) (సి) గ్లెన్ ఫిలిప్స్ (బి) మాట్ హెన్రీ; కుల్ దీప్ యాదవ్ 1 నాటౌట్ (1). అదనపు పరుగులు:10 మొత్తం:249-9 (50).
న్యూజిలాండ్ బౌలింగ్:మాట్ హెన్రీ 8-0-42-5; కైల్ జేమీసన్ 8-0-31-1; విలియమ్ ఓరూర్కే 9-0-47-1; మిచెల్ శాంట్నర్ 10-1-41-1; మైఖేల్ బ్రేస్ వెల్ 9-0-56-0; రచిన్ రవీంద్ర 6-0-31-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్:విల్ యంగ్ 22 (35; 3×4) (బి) వరుణ్ చక్రవర్తి; రచిన్ రవీంద్ర 6 (12) (సి) అక్షర్ పటేల్ (బి) హార్థిక్ పాండ్య; కేన్ విలియమ్సన్ 81 (120; 7×4) స్టంపింగ్ కేఎల్. రాహుల్ (బి) అక్షర్ పటేల్; డేరిల్ మిచెల్ 17 (35; 1×4) ఎల్బీడబ్ల్యూ (బి) కుల్ దీప్ యాదవ్; టామ్ లాథమ్ 14 (20) ఎల్బీడబ్ల్యూ (బి) రవీంద్ర జడేజా; గ్లెన్ ఫిలిప్స్ 12 (8; 1×4) ఎల్బీడబ్ల్యూ (బి) వరుణ్ చక్రవర్తి; మిచెల్ బ్రేస్ వెల్ 2 (3) ఎల్బీడబ్ల్యూ (బి) వరుణ్ చక్రవర్తి ; మిచెల్ శాంట్నర్ 28 (31; 1×4, 2×6) (బి) వరుణ్ చక్రవర్తి; మాట్ హెన్రీ 2 (4) (సి) కోహ్లీ (బి) వరుణ్ చక్రవర్తి; కైల్ జేమీసన్ 9 నాటౌట్ (4; 1×6); విలియమ్ ఓరూర్కే 1 (2) (బి) కుల్దీప్ యాదవ్; అదనపు పరుగులు:11; మొత్తం:205-10 (45.3).
భారత బౌలింగ్:
మహ్మద్ షమీ 4-0-15-0; హార్థిక్ పాండ్య 4-0-22-1; అక్షర్ పటేల్ 10-0-32-1; వరుణ్ చక్రవర్తి 10-0-42-5; కుల్దీప్ యాదవ్ 9.3-0-56-2; రవీంద్ర జడేజా 8-0-36-1.
Previous Articleఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దేవకట్టా వెబ్ సిరీస్..!
Next Article ఆస్కార్ విజేతలు వీళ్లే..!

