ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది.మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 (96; 4×4, 1×6), అలెక్స్ క్యారీ 61 (57; 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్ 39 (33; 5×4, 2×6) పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్, హార్థిక్ పాండ్య 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ శుభ్ మాన్ గిల్ (8) త్వరగానే కోల్పోయింది. రోహిత్ శర్మ 28 (29; 3×4, 1×6) పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే విరాట్ కోహ్లీ 84 (98; 5×4), శ్రేయాస్ అయ్యర్ 45 (62; 3×4), అక్షర్ పటేల్ 27 (30; 1×4) లతో కలిసి భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. కోహ్లీ అవుటైనా కే.ఎల్.రాహుల్ 42 నాటౌట్ (34; 2×4, 2×6), హార్థిక్ పాండ్య 28(24; 1×4, 3×6) రవీంద్ర జడేజా 2 బ్యాటింగ్ భారత్ ను విజయ తీరాలకు చేర్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు