ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో. ఆ ఊహాగానాలకు స్వయంగా రోహిత్ తనే చెక్ పెట్టాడు. మ్యాచ్ విజేతగా నిలిచిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు రోహిత్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. తనకు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశాడు. తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దని, వన్డే ఫార్మాట్ నుండి ఇప్పుడే తాను రిటైర్ కావట్లేదని స్పష్టతనిచ్చాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుందన్నాడు. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందన్నాడు. త్వరలో రోహిత్ 38వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇక ఇప్పట్లో ఐసీసీ ఈవెంట్ లు ఏమీ లేవు. మళ్లీ 2027లోనే వన్డే ప్రపంచకప్ ఉంది. అప్పటివరకు రోహిత్ జట్టులో ఉంటాడా అని అంతా భావించారు. తాజాగా రోహిత్ సమాధానంతో ఈ రిటైర్మెంట్ వార్తలకు పుల్ స్టాప్ పడింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

