టీమ్ ఇండియా మాజీ కోచ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ గాయంతో బాధపడుతున్నాడు.ఇటీవల రాజస్థాన్ ప్రాక్టీస్ సెషన్‌లో హఠాత్తుగా ప్రత్యక్షమైన ద్రవిడ్,చేతి కర్రల సాయంతో నడవడం,కాలికి బ్యాండేజ్ ఉండటం అభిమానులను కలవరపెట్టింది.బెంగళూరులో క్రికెట్ ఆడుతూ గాయపడ్డట్టు సమాచారం.విజయ క్రికెట్ క్లబ్ తరఫున కుమారుడు అన్వయ్‌తో కలిసి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గ్రూప్ 3 సెమీఫైనల్‌లో పాల్గొన్నాడు.28 బంతుల్లో 29 పరుగులు చేసిన ద్రవిడ్, పరుగులు తీసే క్రమంలో గాయపడ్డాడు.మొదట బ్యాటింగ్ కొనసాగించినా, నొప్పి తీవ్రత పెరగడంతో మైదానం వీడాడు. ట్రీట్‌మెంట్ అనంతరం రాజస్థాన్ క్యాంప్‌లో చేరాడు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Previous Articleవరల్డ్ టాప్ – 50 లో తొమ్మిది భారతీయ విద్యా సంస్థలు…!
Next Article అనుపమ “పరదా” లో అతిధి పాత్రల్లో కనిపించనున్న సమంత ?

