ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ సేన ఇండియా మాస్టర్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. తాజాగా జరిగిన సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా మీపై 94 పరుగుల భారీ విజయం సాధించి సత్తా చాటింది. యువరాజ్ సింగ్ 59 (30; 1×4, 7×6),సచిన్ టెండూల్కర్ 42 (30; 7×4), స్టువర్ట్ బిన్నీ 36 (21; 5×4, 1×6) అదరగొట్టారు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డోహార్టీ, డానియల్ క్రిస్టియన్ లు 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 18.1ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. బెన్ కటింగ్ (39) ఒక్కడే చెప్పుకోదగిన ప్రదర్శన కనబరిచాడు. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్ 4 వికెట్లు, వినయ్ కుమార్ 2 వికెట్లు, ఇర్ఫాన్ పఠాన్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ సెమీస్ లో ఆసీస్ ను చిత్తు చేసి ఫైనల్ చేరిన సచిన్ సేన
By admin1 Min Read