మరో వారంలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే సమ్మర్ వినోదాల జల్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభం కానుంది. జట్లన్నీ కూర్పులను సిద్దం చేసుకుంటున్నాయి. ఈక్రమంలో తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తమ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా అక్షర్ పటేల్ ఎన్నో మ్యాచ్ లలో కీలకంగా వ్యవహరించాడు. ఇక అంతకుముందు ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా రిషభ్ పంత్ కొనసాగాడు. అయితే, వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు పంత్ స్థానంలోనే డీసీ ఆల్ రౌండర్ అక్షర్ ను కెప్టెన్ గా నియమించింది. కాగా, గత కొన్నేళ్లుగా ఢిల్లీ జట్టులో అక్షర్ పటేల్ కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇక మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఈ సీజన్ నుండి ఢిల్లీకి ఆడనున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో రాహుల్‌ను రూ. 14 కోట్లకు డీసీ దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ప్రకటించిన ఫ్రాంచైజీ
By admin1 Min Read
Previous Articleడీఆర్‌డీవో మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డితో సీఎం చంద్రబాబు సమావేశం
Next Article మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం..!