ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు కొత్త కెప్టెన్ గా ఎంపికైన రిషబ్ పంత్ పై వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు నుండి అతనికి పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నాడు. ఈ సీజన్ లో లక్నో మార్చి 24న విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈక్రమంలో పూరన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ విజేతగా నిలిచేందుకు టీమ్ సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. ఈ సీజన్ మాకు మంచి అవకాశం. అనుభవంతో కూడిన ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లతో టీమ్ ఉంది. రిషబ్ పంత్ కు టాలెంట్, అనుభవం, నైపుణ్యం ఉన్నాయని అన్నాడు. అతను ఎలా రాణిస్తాడోనని ఆసక్తిగా మేమంతా ఎదురుచూస్తున్నాం. జట్టు నుండి అతనికి వంద శాతం మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

