సెపక్ తక్రా వరల్డ్ కప్ లో భారత్ కు పసిడి లభించింది. భారత పురుషుల జట్టు మొట్టమొదటి సారిగా ఈఘనత సాధించింది. పాట్నా వేదికగా జరిగిన ఫైనల్ లో జపాన్ పై 2-1తో గెలుపొందింది. మొదటి సెట్ లో వెనుకబడిన భారత జట్టు రెండో సెట్ ను 15-11తో మూడో సెట్ ను 17-14 తో గెలిచుకుని సత్తా చాటింది. గతంలో భారత్ అత్యుత్తమంగా మూడో స్థానంలో నిలిచింది. 2017, 2022లలో కాంస్యం సాధించింది. మరోవైపు భారత మహిళల జట్టు కాంస్యం, మహిళల డబుల్స్ జట్టు రజతం గెలిచాయి. మొత్తంగా ఈ వరల్డ్ కప్ లో అన్ని విభాగాల్లో కలిపి 7 పతకాలు గెలుచుకుంది. మంచి ప్రదర్శన కనబరిచిన సెపక్ తక్రా బృందానికి ప్రధాని మోడీ అభినందించారు.
Previous Articleఐపీఎల్ -18: పాయింట్ల ఖాతా తెరిచిన డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా… రాజస్థాన్ పై ఘన విజయం
Next Article ‘పెద్ది’ గా మాస్ లుక్ లో అదరగొడుతున్న రామ్ చరణ్..!