సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా నేడు జరిగిన మ్యాచ్ లో లక్నో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 47 (28; 5×4, 3×6), అనికేత్ వర్మ 36 (13; 5×6), నితీష్ రెడ్డి 32 (28; 2×4), క్లాసిన్ 26 (17; 2×4, 1×6) పరుగులు చేశారు. ఒక దశలో భారీ స్కోరు చేస్తుందనుకున్న సన్ రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయి ఆ మాత్రం స్కోరుకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో లక్నో బ్యాటర్లు ధాటిగా ఆడారు. నికోలస్ పూరన్ 70 (26; 6×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మిచెల్ మార్ష్ 52 (31; 7×4, 2×6) రాణించాడు. అబ్దుల్ సమద్ 22 నాటౌట్ గా నిలిచాడు. మరో 3.5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్నో విజయం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు