కోల్ కతా నైట్ రైడర్స్:116-10 (16.2).
ముంబై ఇండియన్స్: 121-2 (12.5).
వరుసగా రెండు పరాజయల తర్వాత ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ గెలుపు ఖాతా తెరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ముంబై కోల్ కతా నైట్ రైడర్స్ ను కేవలం 116 పరుగులకే కట్టడి చేసింది. రఘువన్షీ (26) టాప్ స్కోరర్. రమన్ దీప్ (22) పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముంబై కొత్త బౌలర్ అశ్వినీ కుమార్ 4 వికెట్లతో సత్తా చాటాడు. చాహార్ 2 వికెట్లు, శాంట్నర్, బౌల్ట్, హార్థిక్ పాండ్య, విఘ్నేష్ పుతుర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబై కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే ఛేదించింది. రికెల్టన్ 62 నాటౌట్ (41; 4×4, 5×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ 27 నాటౌట్ (9; 3×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ తో సునాయాసంగా ముంబై విజయాన్ని అందుకుంది.
Previous Articleఅల్లు అర్జున్ – అట్లీ చిత్రం నుండి క్రేజీ అప్‌డేట్!
Next Article వెస్టిండీస్ టీ20 టీమ్ కెప్టెన్ గా షై హోప్..!