ఆసియా ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో సింధు జపాన్ కు చెందిన యమగూచి చేతిలో 12-21, 21-16, 16-21తో ఓటమి చెందింది. పురుషుల సింగిల్స్ లో కూడా భారత్ కు పరాభవం ఎదురైంది. ప్రి క్వార్టర్స్ లో ప్రియాన్షు రజావత్ 14-21, 17-21తో ఐదో సీడ్ జపాన్ కు చెందిన కొడయ్ నరవక చేతిలో, కిరణ్ జార్జ్ 21-19, 13-21 తేడాతో థాయ్ లాండ్ కు చెందిన కున్లావత్ వితిద్సర్న్ చేతిలో ఓడారు. ప్రి క్వార్టర్స్ లో ధ్రువ్-తనీషా క్యాస్ట్రో జోడీ చైనీస్ తైపీకి చెందిన హాంగ్ వీ నికోల్ గొంజాలెస్ జోడీ పై 12-21, 21-16, 21-18తో గెలుపొందింది.
Previous Articleలాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో 6 క్రికెట్ టీమ్ లు..!
Next Article ఆర్చరీ వరల్డ్ కప్: ఫైనల్ చేరిన మెన్స్ రికర్వ్ టీమ్

