ఐపీఎల్ లో భాగంగా నిన్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఆటగాడు కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5వేల పరుగుల మైలురాయిని చేరుకుని అరుదైన ఘనత సాధించాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో 57 నాటౌట్ గా నిలిచి టీమ్ ను గెలుపు తీరాలకు చేర్చాడమే కాకుండా ఈఘనత సాధించాడు. అతని తర్వాత డేవిడ్ వార్నర్ (135 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (157 ఇన్నింగ్స్), ఏబీ డివిలియర్స్ (161 ఇన్నింగ్స్), శిఖర్ ధావన్ (168 ఇన్నింగ్స్) లు ఉన్నారు. రాహుల్ 46.35 యావరేజ్ తో, 135.70 స్ట్రైక్‌రేట్‌తో 5వేల పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 4 సార్లు డకౌట్ అయ్యాడు. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లక్నో ఇచ్చిన 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు