భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కాగా, ఈ విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ‘ఐ కిల్ యూ’ అంటూ రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని ఆయన ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో సైబర్ సెల్ దీనిపై ఎంక్వైరీ చేపట్టింది. ఇక తనకు రక్షణ కల్పించాలని గంభీర్ కోరారు. ఐసీస్ కాశ్మీర్ నుండి ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పహాల్గాం ఉగ్రదాడి ఘటనపై గంభీర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిలో మరణించిన వారి కోసం ప్రార్థిద్దాం. ఘటనకు బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని భారత్ తిప్పికొడుతుందని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు