పహాల్గాం దానికి సంబంధించి పాకిస్థాన్ తీరును అందరూ దుయ్యబడుతున్న సంగతి తెలిసిందే. క్రీడాకారులు, దేశాధినేతలు భారత్ కు అండగా నిలుస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పాక్ తీరును ఎండగట్టారు. గత 78 ఏళ్లలో వాళ్లు సాధించింది ఏమీ లేదని అంటే రాబోయే 78 వేల ఏళ్లకు కూడా ఎటువంటి మార్పు ఉండబోదని పాక్‌కు పరోక్షంగా చురకలంటించారు. మరి అలాంటప్పుడు శాంతియుతంగా ఎందుకు జీవించడం లేదని గవాస్కర్ ప్రశ్నించారు. 78 ఏళ్లలో ఒక్క మిల్లీమీటర్ భూమి కూడా మారలేదని, అంటే రాబోయే 78 వేల ఏళ్లకు కూడా ఎటువంటి మార్పు ఉండబోదనుండి పేర్కొన్నారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఇది భారతీయులందరిపైనా ప్రభావం చూపుతుందన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం సునీల్ గవాస్కర్ పహాల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ఏం సాధించారు?… పాకిస్థాన్ కు చురకలంటించిన క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్
By admin1 Min Read
Previous Articleతిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించిన భద్రత బలగాలు…!
Next Article ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత