ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా దాదాపు ప్లే ఆఫ్ రేసు కు దూరమైనట్లే. తాజాగా ఆ జట్టు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడి మరో పరాజయం ఖాతాలో వేసుకుని పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ శుభ్ మాన్ గిల్ 76 (38; 10×4, 2×6), జాస్ బట్లర్ 64 (37; 3×4, 4×6)లు హాఫ్ సెంచరీలతో రాణించగా…సాయి సుదర్శన్ 48 (23; 9×4), వాషింగ్టన్ సుందర్ 21 (16; 1×6) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఉనద్కత్ 3 వికెట్లు పడగొట్టగా…జీషన్ అన్సారీ, కమ్మిన్స్ ఒక్కో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభిషేక్ శర్మ 74 (41; 4×4, 6×6) టాప్ స్కోరర్. హెన్రిచ్ క్లాసిన్ 23 (18; 1×4, 1×6), నితీష్ కుమార్ రెడ్డి (21 నాటౌట్), కమ్మిన్స్ (19 నాటౌట్) పరుగులు చేయడంతో విజయానికి 38 పరుగుల దూరంలో నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు