కోల్ కతా నైట్ రైడర్స్: 206-4 (20).
రాజస్థాన్ రాయల్స్: 205-8 (20).
ఉత్కంఠ భరిత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం ఒక పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచింది. ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.ఆండ్రీ రస్సెల్ 57 (25; 4×4, 6×6) మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. రఘువన్షీ 44 (31; 5×4), గుర్బాజ్ 35 (25; 4×4, 1×6), అజింక్య రహానే 30 (24; 1×4, 2×6) పరుగులు చేయడంతో భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ మంచి పోరాటం కనబరిచింది. రియాన్ పరాగ్ 95 (45; 6×4, 8×6) టాప్ స్కోరర్. యశస్వీ జైశ్వాల్ 34 (21; 5×4, 1×6), సిమ్రోన్ హెట్మేయర్ 29 (23; 1×4, 1×6), శుభమ్ దూబే 25 నాటౌట్ (14; 1×4, 2×6) పరుగులతో గెలుపు అంచుల దాకా తీసుకెళ్ళినా రాజస్థాన్ ఒక పరుగు తేడాతో మ్యాచ్ లో ఓటమి పాలైంది. కోల్ కతా బౌలర్లలో హార్షిత్ రాణా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు చొప్పున తీశారు. వైభవ్ అరోరా 1 వికెట్ పడగొట్టాడు.