ఖతార్ వేదికగా జరిగిన దోహా డైమండ్ లీగ్ 2025లో భారత జావెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో మొదటిసారి 90మీ. మార్క్ ను దాటాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ మూడో రౌండ్‌లో 90.23 మీటర్ల త్రో విసిరి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హౌమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ ఈ ప్రదర్శన చేశాడు. తొలి రౌండ్‌లో 88.84మీ. విసిరాడు. రెండో రౌండ్ ఫౌల్ అయింది. ఇక మూడో రౌండ్‌లో తన కెరీర్ బెస్ట్‌ను సాధించాడు. ఏకంగా 90 మీటర్లు విసిరి సత్తా చాటాడు. అయితే జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్ (91.06 మీటర్లు) చివరి రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత అండర్సన్ పీటర్స్ 85.64 మీటర్లతో మూడో స్థానం సాధించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు