ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న లక్నో సూపర్జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టు తాజాగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ (జీటీ)పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) సెంచరీతో రాణించాడు. నికోలస్ పూరన్ 56 (27;4×4, 5×6), మార్క్రమ్ 36 (24; 3×4, 2×6) పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ పోరాడినప్పటికీ 9 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభ్మన్ గిల్ 35 (20; 7×4), జోస్ బట్లర్ 33 (18; 3×4, 2×6), షెర్ఫేన్ రూథర్ఫర్డ్ 38 (22; 1×4, 3×6), షారుఖ్ ఖాన్ 57(29; 5×4, 3×6) పరుగులు చేశారు.
Previous Articleజూన్ 4 రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం: మాజీ సీఎం వైఎస్ జగన్
Next Article మాజీ మంత్రి కొడాలి నాని పై లుకౌట్ నోటీసులు జారీ