ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో తొలిరోజే భారత్ గోల్డ్ మెడల్ తో శుభారంభం చేసింది. 10 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ స్వర్ణంతో సత్తా చాటాడు. అతడు 28 నిమిషాల 38.63 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. జపాన్, కు చెందిన మెబుకి సుజుకి 28 నిమిషాల 43.84 సెకన్లతో సిల్వర్ మెడల్, బహ్రెయిన్ కు చెందినఆల్బర్ట్ రోప్, 28 నిమిషాల 46.82సె తో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. భారత అథ్లెట్ సవాన్ బర్వాల్ (28 నిమిషాల 50.53 సె) కొద్దిలో మెడల్ కోల్పోయాడు. గుల్వీర్ ఈ ఏడాది ఆరంభంలోనే 10 వేల మీటర్లలో నేషనల్ రికార్డు (27 నిమిషాల 00.22 సె) నెలకొల్పాడు. 5 వేల మీటర్లలోనూ నేషనల్ రికార్డు (12 నిమిషాల 59.77 సెకన్లు) అతడి పేరిట ఉంది. 20 కి.మీ రేస్వాక్లో సెబాస్టియన్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. అతడు గంట 21 నిమిషాల 13.5 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు