సౌతాఫ్రికా క్రికెట్ స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 33 ఏళ్ల వయసులో ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
‘నాకు ఇది ఓ బాధకరమైన రోజు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఎంతో కాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. నాకు, నా కుటుంబానికి ఏది మంచిదో ఆ నిర్ణయమే తీసుకున్నాను.. ఇది చాలా కష్టమైన నిర్ణయం అయినా, నాకు ఇదే సరైన సమయం అనిపిస్తోంది..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు ఈ సౌతాఫ్రికా క్రికెటర్ హెన్రీచ్ క్లాసిన్. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడి వన్డేల్లో 4 సెంచరీలు 11 హాఫ్ సెంచరీలు, టీ20ల్లో 5 హాఫ్ సెంచరీలు చేశాడు. నాలుగు టెస్టుల్లో 104 పరుగులు చేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఆడిన సౌతాఫ్రికా టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఆడుతున్నాడు. 2025 మెగా వేలంలో హెన్రీచ్ క్లాసిన్‌ని రూ.23 కోట్లకు ఆ జట్టు రిటైన్ చేసుకుంది. ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 105 పరుగులు చేసి.. ఐపీఎల్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు సౌతాఫ్రికా20 లీగ్‌లో డర్భన్ సూపర్ జెయింట్స్ జట్టు తరుపున ఆడే హెన్రీచ్ క్లాసిన్, మేజర్ లీగ్ క్రికెట్ (MLC), ది హాండ్రెడ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ల్లో కూడా అతను ఆడుతున్నాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసిన్
By admin1 Min Read