ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ టైటిల్ ను ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినర్ కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ ఆధిపత్యానికి తెరదించుతూ తనదైన ఆటతీరుతో అదరగొట్టేసిన ప్రపంచ నెంబర్ వన్ సినర్ ఈ టోర్నీలో కొత్త ఛాంపియన్ గా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ సినర్ 4-6, 6-4, 6-4, 6-4తో రెండోసీడ్ అల్కరాస్ పై విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కార్లోస్ అల్కరాస్-యానిక్ సినర్ లు హోరాహోరీగా పోరాడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మాత్రం సినర్ దూకుడు ముందు అల్కరాస్ పోరాటం సరిపోలేదు. దీంతో ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో హ్యాట్రిక్ సాధించాలనుకున్న స్పెయిన్ స్టార్ పై పూర్తి ఆధిపత్యం చాటుకుంటూ గ్రాస్ కోర్టులో యానిక్ సినర్ అదిరే విజయంతో వింబుల్డన్ టైటిల్ గెలిచాడు . గత రెండేళ్లలో అల్కరాస్ పై సినర్ కు ఇదే తొలి విజయం. అతడికిది నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో ఫైనల్ చేరిన ప్రతిసారీ టైటిల్ గెలిచిన అల్కరాస్ రికార్డు కనుమరుగైంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు